తిరుపతి: వైభవంగా శ్రీ గోవిందరాజస్వామి రథోత్సవం

తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజైన శనివారం రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. గోవింద నామస్మరణలతో తిరువీధులు మార్మోగగా, వేలాది మంది భక్తులు రథాన్ని లాగి స్వామివారిపై తమ భక్తిని చాటుకున్నారు. రథోత్సవం కర్ణాలవీధి, బేరివీధి, గాంధీరోడ్డు మీదుగా సాగి తిరిగి ఆలయ రథమండపానికి చేరుకుంది. మార్గమధ్యంలో భక్తులు టెంకాయలు కొట్టి, కర్పూర హారతులు సమర్పిస్తూ స్వామివారికి మంగళారతులు అర్పించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్