తిరుచానూరు పంచాయతీ కార్యాలయంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్ సర్వీసెస్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ సర్వీసెస్ అసోసియేషన్ అడ్ హక్ అధ్యక్షుడు హరిప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 4 వరకు ఉద్యోగస్తులను వారి గ్రేడ్ ప్రకారం బదిలీలు చేయాలని అన్నారు. పంచాయతీరాజ్ ఉద్యోగస్తులందరికీ అసోసియేషన్ ఎల్లవేళలా తోడుగా ఉంటుందని అన్నారు.