మద్యం సేవించి వాహనాలు నడిపిన 8 మందికి రూ.80,000 జరిమానా

2026 ఏప్రిల్ 28, మంగళవారం నాడు చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డూడి ఆదేశాల మేరకు, చిత్తూరు SDPO వెంకట నారాయణ ఆధ్వర్యంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నిత్య బాబు నిర్వహించిన వాహన తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 8 మంది పట్టుబడ్డారు. వీరిని చిత్తూరు కోర్టులో హాజరుపరచగా, న్యాయమూర్తి K. పరిమళ దేవి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం 80,000 రూపాయల జరిమానా విధించారు. ఒకరికి జరిమానాతో పాటు కోర్టులోనే నిలబడే శిక్ష పడింది. మళ్ళీ నేరం చేస్తే రూ.15,000 జరిమానా లేదా 3 ఏళ్ల జైలు శిక్ష పడవచ్చు.

సంబంధిత పోస్ట్