చిత్తూరు పెద్దదళితవాడలో ఇంట్లోని చెత్తను పక్కింటి వద్ద వేశారనే కారణంతో ఓ మహిళపై దాడి జరిగింది. నాగమ్మ అనే మహిళ తన ఇంటిని శుభ్రం చేస్తూ చెత్తను బయట వేయగా, పక్కింటి పవన్ తదితరులు ఆమెతో వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడ్డారు. గాయపడ్డ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య కేసు నమోదు చేశారు.