చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో డాక్టర్ పుట్టపర్తి నారాయణ చార్యుల జయంతిని శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి ఎస్పీ తుషార్ డూడీ తన సిబ్బందితో కలిసి పూలమాలవేసి నివాళులర్పించారు. 15 భాషల్లో ప్రావీణ్యం సాధించడం అరుదైన విషయమని, తెలుగు భాషాభివృద్ధికి ఆయన చేసిన కృషిని ఎస్పీ కొనియాడారు.