ఏపీ ప్రభుత్వం కుంకీ ఏనుగులకు ఆధార్ కార్డు తరహాలో ప్రత్యేక గుర్తింపు కార్డులను తీసుకురానుంది. ఇందుకోసం డీఎన్‌ఏ టెస్టులు నిర్వహిస్తున్నారు. రెండు రోజుల క్రితం రక్త నమూనాలను సేకరించి డెహ్రాడూన్ వైల్డ్ లైఫ్ ఇన్‌స్టిట్యూట్‌కు పంపారు. అక్కడ డీఎన్‌ఏ టెస్టులు పూర్తయ్యాక, ఏనుగులకు సంబంధించిన అన్ని వివరాలతో కూడిన ప్రత్యేక గుర్తింపు కార్డును జారీ చేస్తారు. భవిష్యత్తులో వైద్యం, జన్యుపరమైన సమస్యల పరిష్కారానికి, ఏనుగుల ఆరోగ్యాన్ని అంచనా వేయడానికి ఈ కార్డు ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు.