ఐరాల మండలం చిగరపల్లె సమీపంలో ఆరు లైన్ల జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని ఎగువ పాలకూరు గ్రామానికి చెందిన చంటి, సుధా అనే మహిళ మృతి చెందారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో చంటి అక్కడికక్కడే మృతి చెందగా, సుధా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.