చిత్తూరులోని గోకులం వీధి, గొల్ల వీధిలలో సీసీ రోడ్లన్నీగుంతలుగా మారి అధ్వన్నంగా తయారయ్యాయి. ఈ దారుల గుండా వెళ్లాలంటే వాహనదారులు భయపడుతున్నారు. పాదచారులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. గుంతలు పూడ్చాలని కోరుతున్నారు. అధికారులు చొరవ తీసుకుని సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.