చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఈ విద్యా సంవత్సరంలో గత విద్యా సంవత్సరం కంటే 10 శాతం ప్రవేశాలు పెంచాలని డీఐఈవో రఘుపతి సూచించారు. జిల్లాలో ఇప్పటి వరకు 1826 మంది మొదటి సంవత్సరం అడ్మిషన్లు తీసుకున్నారని, ప్రవేశాలు పెంచేలా ప్రిన్సిపల్స్ పకడ్బందీ చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశించారు. విద్యార్థులు జులై 31వ తేదీ వరకు ప్రవేశాలు పొందేందుకు అవకాశం ఉందని తెలిపారు.