చిత్తూరు: వ్యక్తిపై హత్యాయత్నం కేసు నమోదు: సీఐ

చిత్తూరులో వ్యవసాయ మోటార్ సర్వీస్ వివాదంలో ఇద్దరు మహిళలపై కత్తితో దాడి జరిగిన ఘటనపై టూ టౌన్ సీఐ నెట్టికంటయ్య బుధవారం స్పందించారు. గిరింపేట విద్యుత్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ పిటిషన్ విచారణ సమయంలో భాస్కర నాయుడు అనే వ్యక్తి ఈ దాడికి పాల్పడినట్లు తెలిపారు. బాధితులను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని, ఈ ఘటనపై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్