చిత్తూరు: డిజిటల్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ

డిజిటల్ అరెస్టులు, మోసాలపై జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ తుషార్ డూడీ సోమవారం సాయంత్రం తెలిపారు. చిత్తూరు కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మోసగాళ్లు డిజిటల్ అరెస్ట్ పేరుతో ఫోన్, మెసేజ్, వీడియో కాల్ ద్వారా ప్రజలను మోసగించేందుకు ప్రయత్నిస్తారని హెచ్చరించారు. ఎటువంటి దర్యాప్తు సంస్థలు వీడియో కాల్ ద్వారా ఎవరినీ అరెస్టు చేయవని స్పష్టం చేశారు. మోసగాళ్లు నగదు డిమాండ్ చేస్తే చెల్లించరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్