చిత్తూరు జిల్లా కోర్టుకు మంగళవారం బాంబు బెదిరింపు మెయిల్ రావడంతో కలకలం రేగింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు, న్యాయమూర్తులు, న్యాయవాదులు, బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. వన్ టౌన్ సీఐ మహేశ్వర ఆధ్వర్యంలో కోర్టు ప్రాంగణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అగ్నిమాపక అధికారులు కూడా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు.