చిత్తూరు జిల్లా, గుడిపాల మండలంలోని గుడిపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా, పీహెచ్‌సీల్లో పనిచేసే అధికారులు, సిబ్బంది తప్పనిసరిగా సమయపాలన పాటించాలని ఆయన ఆదేశించారు. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించారు. ఈ తనిఖీ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు.