చిత్తూరు నుండి వేలూరు వైపుగా వెళ్తున్న కంటైనర్ గుడిపాల మండలం పానాటూరు వద్ద ఆదివారం డ్రైవరు అనారోగ్య కారణంగా అదుపుతప్పి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది. స్థానికుల సమాచారం మేరకు 108 ద్వారా ఆస్పత్రికి తరలించగా చిన్నపాటి గాయాలతో ప్రమాదం నుండి తూత్తుకుడి చెందిన డ్రైవర్ సతీష్ బయటపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.