జిల్లాలో 23,095 మంది విద్యార్థులు పదవ తరగతి పరీక్షలు రాశారు. ఇందులో 12,105 మంది బాలురు, 10,990 మంది బాలికలు ఉన్నారు. గురువారం ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో, పాఠశాలల్లోని హెచ్ఎంలు తప్పనిసరిగా విద్యార్థులకు అందుబాటులో ఉండాలని జిల్లా విద్యాశాఖ అధికారి రాజేంద్రప్రసాద్ ఆదేశించారు. విద్యార్థులందరూ తమ ఫలితాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.