చిత్తూరు: వెయ్యి మందితో సైకిల్ ర్యాలీ ఎక్కడో తెలుసా...

ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం చిత్తూరులో జిల్లా అదనపు ఎస్పీ రాజశేఖర్ బాబు జండా ఊపి సైకిల్ ర్యాలీని ప్రారంభించారు. కేశవరెడ్డి మెమోరియల్ ఫౌండేషన్, లైన్స్ క్లబ్ చిత్తూరు గోల్డ్, విజయం విద్యా సంస్థల సహకారంతో సుమారు వెయ్యి మంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. విజయం కళాశాల నుండి గాంధీ కూడలి మీదుగా పట్టణంలో ఈ ర్యాలీ కొనసాగింది. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ సీఐ నిత్య బాబు, డాక్టర్ భరత్ రెడ్డి, కేశవరెడ్డి మెమోరీ ట్రస్ట్ వ్యవస్థాపకులు శ్రీధర్ రెడ్డి, పోలీసు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్