ఉ. చిత్తూరు జిల్లాలో గజరాజుల ఉన్మాదం రోజూవారీగా మారింది. ఏనుగులు పంటలను నాశనం చేస్తున్నాయి. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ దాడులను ఎదుర్కొనేందుకు అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ కుంకీ ఏనుగులను తెప్పించినా, అవి ఇప్పటికీ చర్యలోకి రాలేదు. ఇప్పటికీ గజదాడులు కొనసాగుతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.