చిత్తూరు నగరంలో బుధవారం రాత్రి పేకాట ఆడుతున్న నలుగురిని 2-టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. యాదమరి జంక్షన్ వద్ద జూదం జరుగుతోందని సమాచారం అందుకున్న 2-టౌన్ సీఐ నెట్టికంటయ్య తన బృందంతో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో నిందితుల నుంచి సుమారు రూ. 4వేల నగదు, పేకాట ముక్కలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.