చిత్తూరు: గంజాయి విక్రయిస్తున్న నలుగురు అరెస్ట్

చిత్తూరులోని తాళంబేడు రోడ్డులో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్టు చేశారు. 1. 300 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు వన్ టౌన్ సీఐ మహేశ్వర బుధవారం తెలిపారు. సురేశ్ , కుమార్ , ప్రభాకర్ , సీతారాం అనే నలుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు చెప్పారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్