గుడిపాల (M) అనుపు AAW గ్రామానికి చెందిన దిలీప్ కుమార్ (40)కు పోక్సో కోర్ట్ జడ్జ్ శంకర్‌రావు శుక్రవారం 20 ఏళ్ల జైలు శిక్ష విధించారు. బాలికను గర్భవతిని చేసిన కేసులో ఈ తీర్పు వెలువడింది. జైలు శిక్షతో పాటు రూ.5 వేల జరిమానా కూడా విధించారు. బాలికలు, మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కోర్టు హెచ్చరించింది.