చిత్తూరు: థియోసాఫికల్ భూములపై హైకోర్టు కీలక ఆదేశం..!

థియోసాఫికల్ భూముల వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బుధవారం విచారణ చేపట్టిన ధర్మాసనం, ఈ భూములపై సమగ్ర విచారణ జరపాలని చిత్తూరు జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. ఈ కేసుల తదుపరి విచారణను జూన్ 30కి వాయిదా వేసింది. ఇప్పటికే మున్సిపల్ కార్పొరేషన్ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కొందరు నేతలు ఈ భూములపై కన్నేసినట్లు కాంగ్రెస్, మాజీ వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు.

సంబంధిత పోస్ట్