చిత్తూరు: మా నాయకుడిని కించపరిచే విధంగా మాట్లాడటం సమంజసం కాదు

ఆంధ్ర రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను కించపరిచే విధంగా మాట్లాడితే చూస్తూ ఊరుకోమని, తగిన గుణపాఠం చెబుతామని చిత్తూరు నియోజకవర్గ జనసేన నాయకుడు లోచన్ శ్రీరామ్ హెచ్చరించారు. గురువారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నాదెండ్ల మనోహర్ రాష్ట్రానికి కావాల్సిన మౌలిక సదుపాయాల కోసం ఢిల్లీలో అమిత్ షా ని కలవడానికి వెళ్తే దానిని వక్రీకరిస్తున్నారని అన్నారు.

సంబంధిత పోస్ట్