చిత్తూరు: జీవితంలో మెడిటేషన్ ఒక భాగం చేసుకోవాలి: అడిషనల్ ఎస్పీ

మానవులు తమ నిత్య జీవితంలో మెడిటేషన్ ను భాగం చేసుకోవాలని ఏఆర్ అడిషనల్ ఎస్పీ దేవదాస్ సూచించారు. శుక్రవారం సాయుధ దళం పెరేడ్ గ్రౌండ్లో హార్ట్ ఫుల్ మెడిటేషన్ కార్యక్రమం నిర్వహించారు. మూడు రోజులపాటు జరిగే ఈ కార్యక్రమంలో పోలీసులు పాల్గొని ధ్యానం ద్వారా శారీరిక, మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మెడిటేషన్ ప్రాముఖ్యతను తెలియజేశారు. పలువురు అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్