సత్యసాయి బాబా శతజయంతి వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న శ్రీ సత్యసాయి ప్రేమ ప్రవాహిని రథయాత్ర సోమవారం చిత్తూరుకు చేరుకుంది. శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రథయాత్ర బీవీ రెడ్డి కాలనీలోని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ నివాసం వద్దకు చేరుకుంది. రథంలోని శ్రీ సత్యసాయి బాబా చిత్రపటానికి ఆయన పూజలు చేశారు.