చిత్తూరు: గతంలో క్వారీలపై ఏమాత్రం కరుణ చూపలేదు.. టీడీపీ

గత ప్రభుత్వంలో క్వారీలపై కరుణ చూపకుండా నిలువు దోపిడీ చేశారని చిత్తూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు షణ్ముఖ రెడ్డి శనివారం  ఆరోపించారు. నారా లోకేష్ చేపట్టిన యువగళంలో క్వారీ యజమానులు తమ సమస్యలను చెప్పుకున్నారని, అప్పుడు ఇచ్చిన హామీ మేరకు ఇప్పుడు కబ్జా కోరల నుంచి క్వారీలను విడిపించే ప్రయత్నం ప్రభుత్వం చేసిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్