చిత్తూరు జిల్లాలో వైసీపీ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకుంది. చిత్తూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన టీజీ సురేశ్ అలియాస్ బుల్లెట్ సురేష్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారన్న ఆరోపణల నేపథ్యంలో క్రమశిక్షణ కమిటీ సిఫార్సులపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు పార్టీ వర్గాలు గురువారం తెలిపాయి.