పలమనేరు మండలం, పెంగరగుంట పంచాయతీ, జంగాలపల్లి గ్రామానికి చెందిన తేజస్విని, తమ పూర్వీకుల నుంచి అనుభవంలో ఉన్న భూమిని నీలమ్మ, చక్రపాణి అనే ఇద్దరు వ్యక్తులు ఆక్రమించుకున్నారని బుధవారం చిత్తూరు ప్రెస్ క్లబ్ లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆరోపించారు. తమ పొలంలోనే ఇల్లు ఉందని, ఆ ఇంటికి దారి ఇవ్వడం లేదని, ఆక్రమణదారులు నకిలీ పట్టాలు సృష్టించి తమను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆమె వాపోయారు.