త్వరలో చేపట్టనున్న ప్రత్యేక ఓటర్ల సవరణలో ఏ ఒక్క ఓటు తొలగకుండా బీఎన్ఏలదే కీలక పాత్ర అని టీడీపీ చిత్తూరు నియోజకవర్గ అబ్జర్వర్ కుమారి బుధవారం తెలిపారు. చిత్తూరు పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో రూరల్, మున్సిపల్ పరిధిలోని కమిటీ సభ్యులకు ఓటర్ల సవరణ కార్యక్రమంపై అవగాహన కల్పించారు. ప్రతి ఓటరు ఫారం 2ను సక్రమంగా పూర్తి చేసి సమర్పించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.