చిత్తూరుకు చెందిన విద్యార్థి సాయి భార్గవ్ ఇటీవల గుంటూరు జిల్లాలో జరిగిన అండర్-17 రాష్ట్రస్థాయి మోడ్రన్ లేజర్ రన్ పోటీల్లో విజయం సాధించాడు. ఈ క్రమంలో జాతీయస్థాయికి ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని బృందావన్ పాఠశాల నిర్వాహకురాలు శైలజ కుమారి, డైరెక్టర్ ప్రియ తేజ సోమవారం తెలిపారు. భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు.