చిత్తూరు: జిల్లా స్థాయిలో మూడో బహుమతి

కార్వేటినగరం డైట్ కళాశాలలో మాదక ద్రవ్యాల నిర్మూలనపై నిర్వహించిన చిత్రలేఖన పోటీలో వరదప్ప నాయుడు నగరపాలకోన్నత పాఠశాల విద్యార్థి మనోజ్ మూడో బహుమతి సాధించాడు. గురువారం హెచ్‌ఎం భాను ప్రభా మెమెంటో, ప్రశంసాపత్రం అందజేసి అభినందించారు. విద్యార్థులు చదువుతోపాటు ఇతర సహపాఠ్య కార్యకలాపాల్లో కూడా పాల్గొనాలని ఆమె సూచించారు.

సంబంధిత పోస్ట్