వైసీపీ చిత్తూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ విజయానంద రెడ్డి, కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ఆరోపించారు. గురువారం చిత్తూరు రూరల్, గుడిపాల మండలాల్లో పార్టీ ఆధ్వర్యంలో జరిగిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పేదలకు సంక్షేమ పథకాలు అందించడంలో ప్రభుత్వం చొరవ చూపాలని, ఎన్నికల హామీలను వెంటనే నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.