చిత్తూరు రూరల్ మండలంలోని సిద్ధంపల్లి వద్ద జూన్ 26న రైల్వే సిగ్నల్ ట్యాంపరింగ్ చేసి దుండగులు ప్రయాణికులను దోచుకున్న వారిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో పూణేకు చెందిన జలింధర్ మహిరియా పవార్ , కోహినూర్ నవనత్ పవార్ ను అరెస్ట్ చేసినట్లు గుంతకల్ ఎస్ఆర్పి రాహుల్ మీనా సోమవారం తెలిపారు. నిందితులను ఈ నెల 13న రేణిగుంటలో అరెస్టు చేశామన్నారు. వారు ఆంధ్ర, తెలంగాణలో 9 చోట్ల దొంగతనాలకు పాల్పడినట్లు ఆయన పేర్కొన్నారు.