ఓ పత్రికలో పనిచేస్తున్న ఫోటోగ్రాఫర్ శివ పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని ఏపీడబ్ల్యూజేఎఫ్ నాయకులు అన్నారు. బుధవారం గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు. రాష్ట్ర నాయకులు జయరాజ్ మాట్లాడుతూ బంగారుపాళ్యంలో మాజీ సీఎం జగన్ పర్యటనలో విధి నిర్వహణలో ఉన్న ఫోటోగ్రాఫర్ పై వైసీపీ నాయకులు దాడి చేసి తీవ్రంగా గాయపరచారన్నారు. దాడి చేసిన వారిపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్నారు.