బంగారుపాళ్యం మార్కెట్ యార్డులో వైఎస్ జగన్ పర్యటన కవరేజ్‌కు వెళ్లిన ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శివాపై వైసీపీ కార్యకర్తలు దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ ఏపీ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీపతి బుధవారం తెలిపారు. దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.