శుక్రవారం, చిత్తూరు జిల్లా పుంగనూరులోని ప్రైవేటు బస్టాండ్ సమీపాన వెలసి ఉన్న శ్రీ విరూపాక్షి మారెమ్మ తల్లిని అర్చకులు నేరేడు పళ్ళు, ఈత పళ్ళు, పప్పులతో ఎంతో సుందరంగా అలంకరించారు. అంతకుముందు అమ్మవారికి పంచామృతాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేకించి, ఫల పుష్పాలను నివేదించారు. అమ్మవారి దర్శనానంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు. ఈ అలంకరణ ప్రత్యేకంగా భక్తులను ఆకట్టుకుంది.