చిత్తూరులోని వ్యవసాయ మార్కెట్ కమిటీ తరలింపును నిరసిస్తూ సోమవారం రైతులు, వ్యాపారులు మార్కెట్ యార్డ్ వద్ద ధర్నా నిర్వహించారు. స్థానిక కట్టమంచి వద్ద ఉన్న మామిడి మార్కెట్ ను తరలించి నీటి శుద్ధి కర్మాగారం (ఎస్టీపీ) నిర్మించారని వారు ఆరోపించారు. జిల్లాలోని రైతులకు ఇదే ఆమోదయోగ్యమైన స్థలమని, దీనిపై అధికారులు స్పందించాలని లేనిచో నిరసన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.