చెరువులో పడి నాలుగేళ్ల బాలుడు మృతి

చిత్తూరు జిల్లా సదుం మండలం తాటిగుంటపాలెంలో చెరువు వద్ద ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడి నాలుగేళ్ల బాలుడు రోషన్ గురువారం మృతి చెందాడు. జయచంద్ర, లతా దంపతుల కుమారుడైన రోషన్ తన స్నేహితులతో కలిసి చెరువు వద్దకు వెళ్లగా ఈ విషాదం చోటు చేసుకుంది. స్నేహితులు సమాచారం అందించడంతో కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని బాలుడిని వెలికితీసి పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

సంబంధిత పోస్ట్