చిత్తూరు పట్టణంలో నడివీధి గంగమ్మ జాతర మంగళవారం రాత్రి ప్రారంభమైంది. అమ్మవారి శిరస్సును ఊరేగింపుగా తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో దేవతామూర్తుల వేషధారణలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. మహిళా భక్తులు అమ్మవారికి ఇష్టమైన పూజా సామాగ్రి, పొంగళ్లను సమర్పించారు. భారీ సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ఆలయానికి చేరుకున్నారు.