చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం మానేంద్రం గ్రామంలో విమాన తయారీ ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. HANSA-3(NG) ట్రైనర్ విమానాల తయారీ, ఫ్లైట్ ట్రైనింగ్ స్కూల్ ఏర్పాటుకు 55.47 ఎకరాల భూమి కేటాయించనుంది. రూ.159 కోట్లతో రెండు దశల్లో చేపట్టే ఈ ప్రాజెక్టు ద్వారా 250 మందికి ఉపాధి లభించనుంది. ఏటా 108 విమానాలు తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు.