రాష్ట్రంలో రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు: వేలాదికి ఉపాధి

రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ఊతమిస్తూ, ప్రభుత్వం మరో భారీ అడుగు వేసింది. ఆటోమొబైల్, డేటా సెంటర్, పునరుత్పాదక విద్యుత్ రంగాల్లో వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రానున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (SIPB) సమావేశంలో రూ.2,00,964.10 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదం లభించింది. వీటి ద్వారా సుమారు 38,722 మందికి ప్రత్యక్షంగా ఉపాధి లభించనుంది. తిరుపతిలో రాయల్ ఎన్‌ఫీల్డ్ రూ.2,508 కోట్లతో బుల్లెట్ మోటార్‌సైకిళ్ల తయారీ యూనిట్, విశాఖపట్నంలో రిలయన్స్ రూ.1,08,010 కోట్లతో డేటా సెంటర్, శ్రీసత్యసాయి జిల్లాలో రిలయన్స్ రూ.51 వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్, కడప జిల్లాలో అదానీ గ్రూప్ రూ.12 వేల కోట్లతో హైడ్రో ఎనర్జీ ప్రాజెక్టులు ఏర్పాటు చేయనున్నాయి.

సంబంధిత పోస్ట్