కుప్పం పట్టణం: 'నా చావుకు ఎవరూ బాధ్యులు కారు'

కుప్పం పట్టణంలో మంగళవారం, బంగారుపాళ్యం మండలం దండువారిపల్లికి చెందిన గాయత్రి (30) అనే వివాహిత తన ఇంట్లో ఉరివేసుకుని మృతి చెందింది. 13 ఏళ్ల క్రితం యువరాజును ప్రేమ వివాహం చేసుకున్న గాయత్రికి ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నాడు. భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా తరచూ గొడవలు జరుగుతున్నాయని, గతంలో గాయత్రి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని స్థానికులు తెలిపారు. మృతదేహం సమీపంలో లభించిన లేఖ ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రెండు నెలల క్రితం భర్త యువరాజ్ కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు బంధువులు తెలిపారు.

సంబంధిత పోస్ట్