ఒడిశాకు చెందిన గంజాయి స్మగ్లర్లను చిత్తూరులో అరెస్టు చేసినట్లు ఏఆర్ ఎస్పీ రాజశేఖర్ రాజు, డీఎస్పీ వెంకటనారాయణ బుధవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వెస్ట్ సీఐ శ్రీధర్ నాయుడు, యాదమరి ఎస్ఐ ఈశ్వరయ్య సిబ్బందితో కలిసి నిర్వహించిన ఆపరేషన్లో ఇద్దరు అంతరాష్ట్ర గంజాయి స్మగ్లర్లను అరెస్ట్ చేశామన్నారు. వారి వద్ద దాదాపు 39.7 కేజీల గంజాయిని, 2 మొబైల్ ఫోన్లు, ఓ కారును స్వాధీనం చేసుకున్నామని మీడియాకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అధికారులు పాల్గొన్నారు.