చిత్తూరులో కేక్ కట్ చేసిన ఎమ్మెల్యేలు

రాష్ట్ర ప్రభుత్వ విప్, జీడీ నెల్లూరు ఎమ్మెల్యే డా. వి. ఎం. థామస్ జన్మదినాన్ని సోమవారం చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ స్వగృహంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని, నగరి ఎమ్మెల్యే భాను ప్రకాష్, పూతలపట్టు ఎమ్మెల్యే కె. మురళీమోహన్ పాల్గొని కేక్ కట్ చేశారు. అనంతరం ప్రభుత్వ విప్ కు పూలమాల వేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యం, తెదేపా జిల్లా అధ్యక్షుడు షణ్ముగం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్