తిరుమల దర్శనానికి ఏపీ-కర్ణాటక సరిహద్దు నుంచి వచ్చే భక్తుల సౌకర్యార్థం రైల్వే శాఖ ప్రారంభించిన తిరుపతి-చిక్ మంగళూరు వారపు ఎక్స్ ప్రెస్ రైలు శుక్రవారం రాత్రి కుప్పం చేరుకుంది. తిరుపతి నుంచి బయలుదేరిన ఈ రైలు పాకాల, చిత్తూరు, కాట్పాడి, జోలార్ పేట్, బంగారుపేట మీదుగా చిక్ మంగళూరుకు వెళ్తుది. కుప్పంలో రైలు రాగానే పూజలు చేసి లోకో పైలట్‌కు సత్కారం చేశారు.