పెద్దపంజాణి: భర్తపై కేసు నమోదు

రాజుపల్లికి చెందిన ఉషారాణి ఫిర్యాదు మేరకు, ఆమె భర్త జ్ఞానేశ్వర్ పై శుక్రవారం పెద్దపంజాణి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. 2017లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. జ్ఞానేశ్వర్ వేరే మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని భార్యాపిల్లలను వేధిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పెద్దలు నచ్చజెప్పినా అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఉషారాణి పోలీసులను ఆశ్రయించింది.

సంబంధిత పోస్ట్