చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ మోహన్ ఆదేశాల మేరకు, రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 1 ఆదివారం కావడంతో ఒకరోజు ముందే, శనివారం ఉదయం చిత్తూరు నగరపాలక పరిధిలోని 31వ వార్డులో ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను లబ్ధిదారులకు పంపిణీ చేసింది. 31వ డివిజన్ కార్పొరేటర్ డాక్టర్ సయ్యద్ ఆధ్వర్యంలో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలకు పింఛన్లు అందజేశారు. పింఛన్లు అందుకున్న లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ కార్యదర్శులు సతీష్, సుదర్శన్, సునీత, గోపి పాల్గొన్నారు.