చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, 28వ తేదీన జరగనున్న పల్స్ పోలియో కార్యక్రమంపై లైన్ డిపార్ట్మెంట్లతో సమీక్ష నిర్వహించారు. 0-5 సంవత్సరాల పిల్లల్లో 1,65,203 మందికి టీకాలు వేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 119 రూట్లలో 4842 మంది బూత్ కోఆర్డినేటర్లు, 11000 మంది వాలంటీర్లు, 11 మంది అధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పనిసరిగా పోలియో టీకాలు వేయించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు.