పూతలపట్టు: వినాయక స్వామి సేవలో తనికెళ్ళ భరణి

శనివారం, సినీ నటుడు తనికెళ్ల భరణి తన కుటుంబంతో కలిసి కాణిపాక వరసిద్ధి వినాయక స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఘనస్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం మూషిక మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్