కాణిపాకం శ్రీవరసిద్ధి వినాయక స్వామివారిని రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి రవీంద్రన్, రిటైర్డ్ కర్ణాటక హైకోర్టు న్యాయమూర్తి ఎస్. ఎన్. సత్యనారాయణ్ దర్శించుకున్నారు. ఆలయ అధికారులు వారికి ఘనస్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయ ఈవో పెంచల కిశోర్ వారికి స్వామివారి తీర్థప్రసాదాలు, చిత్రపటాన్ని అందించారు.