పుంగనూరు సమీపంలో రోడ్డు ప్రమాదం

పుంగనూరు మండలం ఎం.కంటేపల్లి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 55 ఏళ్ల మునిరెడ్డి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. గ్రామానికి చెందిన మునిరెడ్డి తన బైకుపై ఇంటికి వెళ్తుండగా, ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆయనకు తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు మొదట పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి, ఆపై మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్